సర్ధార్ టికెట్ కోసం ఇల్లు అమ్మిన అభిమాని..!

సినిమా హీరోలు, హీరోయిన్లు అంటే అభిమానించే వారు చాలా మంది ఉంటారు..వారికోసం ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఏర్పాటు చేసి తమ అభిమాన హీరో సినిమా, పుట్టిన రోజు ఇంకా ఇతర కార్యక్రమాలు ఏవైనా ఆ హీరో స్థాయికి తగ్గట్టు చేస్తుంటారు. ఇక పెద్ద హీరోల సినిమాలు వచ్చాయంటే థియేటర్ల ముందు పడిగాపులు కాస్తారు..మరి కొందరైతే ఎంత ఖరీదైనా చెల్లించి ఫస్ట్ షో చూసి తీరుతారు. ఆ మద్య బాహుబలి చిత్రం కోసం వార రోజుల ముందు నుంచి థియేటర్ల వద్ద పెద్ద జాతర జరిగింది..అభిమానులు పోటీలు పడి మరీ టిక్కెట్ట కోసం కొట్టుకున్నారు..కొందరైతే తప్పని పరిస్థితుల్లో బ్లాక్ లో టిక్కెట్లు కొని చేబులు ఖాళీ చేసుకున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ‘సర్ధార్ గబ్బర్ సింగ్ ’ మానియా నడుస్తుంది.
మామూలుగానే పవన్ కళ్యాన్ అంటే పడి చచ్చేవారు చాలా మంది ఉంటారు..ఇక రెండు సంత్సరాల తర్వాత పవన్ వెండితెరపై కనిపిస్తున్నాడని తెలిస్తే..ఆ సినిమా కోసం ఎన్నికష్టాలైన పడి ఫస్ట్ షో చూసి తీరాలనుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాన్ సర్ధార్ టిక్కెట్లకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది..బ్లాక్ లో అమ్మేవారు బాగా సొమ్ము చేసుకోవడానికి తయారౌతున్నారు. ఇక విదేశాల్లో అయితే తమ అభిమాన హీరోల కోసం ఎంతైనా వెచ్చించి టిక్కెట్టు కొని చూడటం మనం చూస్తూనే ఉన్నాం.
బాబీ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ చిత్రం ఈ నెల 8న విడుదల కాబోతుంది..దీనికోసం అభిమానులు టిక్కెట్ల కోసం ఇప్పటికే యుద్దాలు మొదలు పెట్టారు..ఇక కర్పూల్ జిల్లాలో ఓ అభిమాని తన అభిమాన హీరోకోసం 10 లక్షల ఇల్లు అమ్మేసి టిక్కెట్లు కొన్నాడట..అంటే పవన్ అంటే ఎంత అభిమానమో మాటల్లో చెప్పలేం..అందుకే పవనీజం అంతగా మారుమోగుతుంది.  మరి ఇలాంటి సెన్సేషనల్ రికార్డులు సినిమా విడుదల కాక ముందే వస్తుంటే..సినిమా విడుదలైతే పరిస్థితి ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోండీ..!

Earn Daily 2.5 Lakhs and Join Now